గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (11:56 IST)

నిహారిక.. నా బంగారుతల్లి వరుణ్ తేజ్ భావోద్వేగం..

Varun Tej
మెగా డాటర్ నిహారిక వివాహం సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఇప్పటికీ నిహారిక తనకి చిన్న పిల్లలానే వుందని ఎమోషనల్ అయ్యారు. తాజాగా వరుణ్ తేజ్ కూడా తన మనసులోని మాటని బయటపెట్టారు. 
 
తన చెల్లెలు నిహారిక అంటే తన గుండెలోతుల్లో ఎంత ప్రేమ వుందో వ్యక్తం చేశాడు. "నా బంగారుతల్లి నిహారిక... మా డ్యాషింగ్ బావ చైతన్యకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేనిప్పుడు ఎంత సంతోషంగా వున్నానో వర్ణించేందుకు మాటలు సరిపోవు" అంటూ వరుణ్ తేజ్ తన సోదరిపై వున్న తన ప్రేమని వ్యక్తం చేశాడు. 
 
కాగా మెగా వారసురాలు.. నాగబాబు గారాల పట్టి నిహారిక వెడ్డింగ్ ఈ నెల 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ ఉదయ్ విలాస్‌లో అత్యంత అట్టహాసంగా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగింది. మెగా ఫ్యామిలీలన్నీ ఉదయ్ పూర్‌కు చేరడంతో మెగా సంబరం అంబరాన్ని తాకింది. ప్రతీ ఒక్కరూ అమితానందంతో పెళ్లి వేడుకని ఎంజాయ్ చేశారు. సంగీత్‌లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.