సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (16:47 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి ఆగమనం... చిరు జల్లులు పడే ఛాన్స్

rain
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వీటి ప్రభావం కారణంగా చిరు జల్లులు పడే అవకాం ఉంది. శ్రీహరికోట సమీప ప్రాంతాలపై ఈ రుతుపవనాలు విస్తరించినవున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. ఈ ప్రభావం కారణంగా చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఏపీలోని శ్రీహరికోటతోపాటు కర్నాటక, తమిళనాడు, ధర్మపురి, శివమొగ్గ, రత్నగిరి, హాసన్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించే అనువైన పరిస్థితులు ఉన్నట్టు తెలిపారు. రాగల 24 గంటల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ ప్రభావంతో జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. 
 
మరోవైుపు, ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.