శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (13:40 IST)

వాట్సాప్ కాల్ - రూ.4 కోట్ల నగదు వ్యవహారంపై అవినాశ్ వద్ద సీబీఐ విచారణ

YS Avinash Reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా సిట్టింగ్ ఎఁపీ అవినాశ్ రెడ్డి మరోమారు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. 
 
ముందస్తు బెయిల్ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి శనివారం అవినాశ్ రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి, రుషికేశవ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందులోభాగంగా వరుసగా రెండోవారం ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. 
 
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించడం, రూ.4 కోట్ల నగదు లావాదేవీలతోపాటు సాక్ష్యాలు తారుమారు, వాట్సాప్ కాల్స్ తదితర అంశాలపై అవినాశ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. కాగా... అవినాశ్‌ను ఈ కేసులో 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ అధికారులు, గత శనివారం విచారణకు హాజరైన సమయంలోనే ఆయనను అరెస్టు చేసి... వెంటనే పూచీకత్తు తీసుకుని బెయిలుపై విడుదలైన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అనుచరుడు రుషికేశవ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. 'జమ్మలమడుగుకు వెళ్తుండగా వివేకా హత్య గురించి ఫోన్ రావడంతో వెనక్కి వచ్చాం' అని గతంలో ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అవినాశ్ కాల్ డేటా ఆధారంగా ఆయనను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. రుషికేశవ రెడ్డిది జమ్మలమడుగు పంచాయతీ పరిధిలోని కన్నెలూరు. ఎంపీ ఎక్కడుంటే ఆయనా అక్కడే ఉంటారని తెలుస్తోంది.