సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:53 IST)

ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా 81 కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే కొత్తగా 81 కేసులు బయల్పడ్డాయి. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలో నే 52 వుండడం తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,097కు చేరింది.

గత 24గంటల్లో 81 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 31మంది మృతి చెందగా 231మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 835 ఉన్నట్లు నిర్ధారించారు.

గత 24గంటల్లో అత్యధికంగా కృష్ణాలో 52 కరోనా పాజిటివ్‌ కేసులు, పశ్చిమగోదావరి 12, కర్నూలు 4, ప్రకాశం, 3 కడప 3, గుంటూరు 3, తూర్పుగోదావరి 2, అనంతపురంలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్‌ కేసులు...అనంతపురం 53, చిత్తూరు 73, తూ.గో. 39, గుంటూరు 214, కడప 58, కృష్ణా 177, కర్నూలు 279, నెల్లూరు 72, ప్రకాశం 56, శ్రీకాకుళం 3, విశాఖ 22, ప.గో. 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు.