శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (16:27 IST)

కరోనా దెబ్బ.. వివాహంలో భోజనం పార్శిళ్లు..

కరోనా దెబ్బకు పెళ్లిల్లు, వివాహాలు, పూజలు అన్నీ ఆగిపోతున్నాయి. తాజాగా లాక్ డౌన్ సడలిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు ఇచ్చాయి. దాంతో వాయిదా పడ్డ పెళ్లిళ్లకు ప్రస్తుతం భాజాలు మోగుతున్నాయి. పెళ్లిళ్లకు వచ్చేవాళ్ళు భౌతికదూరాన్ని పాటిస్తూ మాస్క్‌లు ధరించి పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. తాజాగా కృష్ణాజిల్లా కొండపల్లికి చెందిన షేక్‌ కాలేషా తన కుమార్తెను విజయవాడ యువకుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ వివాహం మార్చిలో జరగాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తుంది.
 
లాక్‌డౌన్‌ను జూన్‌ 30వరకు పొడిగించడంతో నిబంధనలకు అనుగుణంగా వివాహం చేద్దామని భావించారు. 20మంది ఆత్మీయులకే ఆహ్వానాలు పంపి, ఆదివారం కొండపల్లిలో వివాహాన్ని నిరాడంబరంగా జరిపించారు. భోజనాన్ని పార్సిళ్లు చేసి పెళ్ళికి వచ్చిన వాళ్లకు అందజేశారు.