బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (09:31 IST)

రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ : చెన్నై - బిట్రగుంట మధ్య రైళ్ళు రద్దు

trains
చెన్నై - బిట్రగుంట ప్రాంతాల మధ్య రైళ్లు రద్దు చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ, గుంతకల్ మధ్య రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా రద్దు చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. రద్దయిన రైళ్ల వివరాలను పేర్కొంది. నంబర్ 17237 బిట్రగుంట - డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, 17238 డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - బిట్రగుంట రైళ్లు ఈ నెల 20 నుంచి 24 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ రైల్వే తెలిపింది. 
 
ఇక నంబర్ 07659 తిరుపతి - కాట్పాడి, 07582 కాట్పాడి - తిరుపతి స్పెషల్ ప్యాసింజర్, నంబర్ 06417 కాట్పాడి - జోలార్‌పేట, నెం. 06418 జోలార్‌పేట - కాట్పాడి మెమో రైళ్లు కూడా ఈ నెల 20 నుంచి 26 వరకు రద్దవుతాయని పేర్కొంది. మరోవైపు నంబర్ 06411 అరక్కోణం - కడప, 06401 కడప - అరక్కోణం స్పెషల్ మెమో రైళ్లు కూడా 26 వరకు రద్దవుతాయని తెలిపింది.
 
తిరుపతి - విల్లుపురం ఎక్స్‌ప్రెస్, విల్లుపురం - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు పాక్షికంగా రద్దవుతున్నాయని తెలిపింది. నంబర్ 16853 తిరుపతి - విల్లుపురం ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి నుంచి బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది. 16854 విల్లుపురం - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతికి బదులుగా కాట్పాడి వరకు మాత్రమే నడుస్తుందని తెలియజేసింది.