Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇతర నిందితులు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌లను కూడా 14 రోజుల రిమాండ్‌కు పంపారు. హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్టు చేసి గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 2:15 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. అట్రాసిటీ చట్టం ప్రకారం పోలీసులు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేయగా, ఈ కేసులోని ఇతర నిందితులైన శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను విజయవాడలో అరెస్టు చేశారు. వంశీని కోర్టుకు హాజరుపరిచే ముందు కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో దాదాపు 8 గంటల పాటు విచారించారు.