1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:24 IST)

అడవి ఉడుము అని పట్టుకుంటే,,, తీరా అది మొసలి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ఉడుముల బ్యాచ్ కి వింత అనుభ‌వం ఎదుర‌యింది.  అతగాడు అడవి ఉడుమ‌ని భావించి కర్రతో కొట్టి, సంచిలో వేసుకుని స్నేహితులకు తెలియజేసి, వాటాలు వేసుకొని తినవచ్చని సమాచారం ఇచ్చాడు. దానిని తీసుకు వచ్చి తీరా వాటాలు వేసుకోవడానికి సంచి నుంచి బయటికి తీసేసరికి అది మొసలి. 
 
రాజ‌మండ్రి శివారు కాతేరు గామాన్ బ్రిడ్జి అవతల రెల్లి గడ్డలంకలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.  కాతేరు కు చెందిన ఒక రైతు బుధవారం తెల్లవారుజామున రెల్లి గడ్డ లంకలోకి పశువులకు మేత వెయ్యటానికి మకం వద్దకు వెళ్ళాడు. అక్కడ మొసలి పశువుల కొట్టం వద్ద సంచరిస్తోంది. దానిని అడివి ఉడుము అని భావించి కర్రతో కొట్టాడు. వెంటనే సంచులో మొసలిని మూటకట్టి, బైక్పై వేసుకుని స్నేహి తులకు సమాచారం ఇచ్చాడు. దాంతో ఆ స్నేహితులు అడివి ఉడుము మాంసం వాటా లేసుకుని, మంచి విందు ఆరగించాల‌నే కోరికతో వ‌చ్చారు. దానిని గ్రామం వద్ద బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చిసంచి విప్పే సరికి తెల్లవారిపోయింది. తీర అది చూస్తే మొసలి. వెంటనే వారు ఆ ముసలి మూతికి తాడుతో కట్టి త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణాలతో ఉన్న ఆ మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
 
ముస‌లి అక్క‌డికి వరదలకు కొట్టుకుని వచ్చిందని భావిస్తున్నారు. వాటి సంతతి ఇంకా ఈ గోదావరిలో ఉన్నట్లయితే, జంతువులు మనుషుల ప్రాణాలకు హాని కలుగుతుందని భయపడుతున్నారు.