ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:57 IST)

చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా.. అయినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు: పురంధేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకున

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. అయినా ఆయన విచారణకు సిద్ధపడకుండా కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు' అభిప్రాయపడ్డారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో లెక్క చెబుతూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1,050 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.700 కోట్లు ఇచ్చిందని, వీటికి ఇప్పటివరకు పూర్తిగా లెక్కలు చెప్పలేదని ఆరోపించారు.