శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (17:47 IST)

తన భర్త మొదటి భార్య నాపై దాడి చేసింది.. దాసరి కోడలు ఫిర్యాదు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మొదటి భార్య తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసిందని అందులో పేర్కొన్నారు.

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రఖ్యాత దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు కోడలు దాసరి పద్మ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త మొదటి భార్య తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసిందని అందులో పేర్కొన్నారు. 
 
జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.46లోని ఇంట్లో తాను, తన భర్త దాసరి తారకహరిహర ప్రభుతో కలిసి ఉంటున్నట్టు చెప్పారు. అయితే, ఈనెల 10వ తేదీన రాత్రి 7 గంటలకు తన భర్త మాజీ భార్య సుశీల, మరో మహిళ సంధ్యను వెంటపెట్టుకుని అక్రమంగా తమ ఇంట్లోకి ప్రవేశించిందన్నారు. 
 
ఆ రోజు రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ తమ ఇంట్లోనే ఉన్నారనీ, తనపై దాడి కూడా చేశారని వెల్లడించారు. ఈ సమయంలో తన భర్త ఇంట్లో లేడని దాసరి పద్మ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.