Daily Horoscope
✕

నేడు, రేపు భారీ వ‌ర్షాలు... అల్పపీడనం ఎఫెక్ట్

Updated: సోమవారం, 16 ఆగస్టు 2021 (10:48 IST)
అల్ప‌పీడ‌నం ప్ర‌భావం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాగ‌ల 48 గంట‌ల్లో పలు చోట్ల భారీ వర్షాలు ప‌డ‌తాయి. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

దీనివల్ల రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల ఈ నెల 17 వరకు ఉత్తరకోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తులో దక్షిణం వైపు ఉంది.

దీని ప్రభావంవల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని ఆ కేంద్రం వివరించింది.

అన్నీ చూడండి

17ఏళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న ప్రభాస్ హీరోయిన్

బిష్ణోయ్ గ్యాంగ్ ప్రధాన టార్గెట్ అమీర్ ఖాన్.. టైగర్ ష్రాఫ్ కాదు...

నటుడు అలీ సతీమణి జుబైదాకు శస్త్రచికిత్స... ఏమైందంటే? (video)

నెలసరి సమయంలో నా భర్త ఎంతో సహకరించారు : హీరోయిన్ రష్మిక

విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ నుంచి ‘నాన్నలా లోకములో’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్...

తర్వాతి కథనం
Show comments