1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 మే 2025 (18:18 IST)

Diamond Hunting: వ్యవసాయ కూలీకి వజ్రంతో జాక్ పాట్- చేతికి రూ.30లక్షలు

Diamond
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం జొన్నగిరి, తుగ్గలి, పెరవలి వంటి గ్రామాల్లో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడి ఎంతో మందికి వజ్రాలు లభించిన సంఘటనలు అనేకం. తాజాగా ఇటీవల మద్దికేర మండలం పెరవలి గ్రామంలో పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలికి ఒక వజ్రం లభించింది. 
 
కర్నూల్ జిల్లా పత్తికొండ ప్రాంతంలో మద్దికెర మండలం పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న ఈ వజ్రాల వేటలో వ్యవసాయ కూలీ జాక్ పాట్ కొట్టేశాడు. పెరవలి గ్రామానికి చెందిన అతనికి దొరికిన వజ్రం భారీగానే ధర పలికింది. రూ.30లక్షలకు ప్రైవేటు వ్యాపారులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించేసి దాంతోనే సంతృప్తి చెందాడు.