శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (15:34 IST)

పవన్ కళ్యాణ్ గురించి నాలుగు ముక్కలు! : ఓ వీరాభిమాని...

Pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్, గేమ్ ఛేంజర్‌గా నిలిచాడు. ఇపుడు ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. జాతీయ మీడియాలో ఆయన అంశంపై గంటల తరబడి చర్చ సాగుతుంది. దీనికంతటికి కారణం ఆయన పట్టుదల. వ్యక్తిత్వం. ఇపుడు పవన్ వీరాభిమాని ఒకరు జనసేనాని గురించి ఇలా రాసుకొచ్చాడు.. 
 
'చిరంజీవి లాగే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడు పవన్' అని జనసేన పార్టీ ఆవిర్భావ సభ సమయంలో చాలామంది అపహాస్యం చేశారు. ఏళ్లు గడుస్తున్నా అది అవ్వకపోయేసరికి.. ఇక వ్యక్తిగతంగా దాడి చెయ్యడం మొదలుపెట్టారు. 'అదేంటి సినిమా డైలాగుల్లా అలా ఊగిపోతూ చెబుతున్నాడు, అసలు మెంటల్ బ్యాలెన్స్ ఉందా', 'అతని పట్ల అతనికి క్లారిటీ ఉందా', 'వరుసపెళ్లిళ్లు చేసుకోవడం కాదు..' అంటూ ఎన్ని అనాలో అన్ని అంటూనే ఉన్నారు. అలా అంటున్న వాళ్లు కూడా సంజన‌తో ఫోన్ కాల్స్‌లో సరసాలు చేసిన  సంబరాల రాంబాబు వంటి వాళ్లు!
 
అవన్నీ పడుతూనే ఉన్నాడు పవన్, మనస్తత్వం చాలా సున్నితమైనదైనా ఎక్కడా అధైర్యపడలేదు. ఆర్థిక వనరులు లేకుండా పార్టీని నడిపించడం అంటే, అదీ కేవలం అభిమానులతో మామూలు విషయం కాదు. పోయిన ఎలక్షన్స్‌లో ఓడిపోయాడని అవహేళన చేస్తే పట్టించుకోకుండా ముందుకు సాగాడు. రాష్ట్రం అల్లకల్లోలం అయిందని, తాను విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి మరోసారి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించి, తన త్యాగంతో టీడీపీతో జతకట్టడానికి ముందుకు వచ్చాడు చూశారా.. అదీ దార్శనికత అంటే! చంద్రబాబు దక్షత ఏంటో తెలుసు.. అందుకే దత్తపుత్రుడు అన్నా పట్టించుకోలేదు. 
 
చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి 50 రోజులకుపైగా జైల్లో పెడితే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అని బాసటగా నిలిచాడు చూశారా అదీ మగాడి తత్వమంటే! జనసేన వల్ల టీడీపీకి నష్టమా, టీడీపీ వల్ల జనసేనకి నష్టమా ఇవన్నీ తర్వాత.. వీళ్లిద్దరు కలవకపోతే రాష్ట్రానికి నష్టం. అలా అలోచించగలిగే పరిపక్వత కేవలం ద్రష్టలకే ఉంటుంది. ఎవరెవర్నో ప్రేరేపించి పవన్‌నీ, చంద్రబాబుని బూతులు తిట్టించారు. కనీసం వాళ్ల కాలిగోటికి కూడా సరిపోని వాళ్లంతా విమర్శిస్తుంటే.. ఈ ఇద్దరు మాత్రం రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. 
 
భవిష్యత్‌లో ఈ రెండు పార్టీలు కలిసి ఐదేళ్ల తర్వాత మళ్లీ పోటీ చేస్తాయా లేదా అప్రస్తుతం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఇద్దరి చేతుల్లో భద్రంగా ఉంది. టీడీపీ, జనసేన! ఈ రెండు పార్టీలూ తమ ఆరోగ్యకరమైన అభివృద్ధే లక్ష్యంగా చేసే రాజకీయాలు మాత్రమే రాష్ట్ర భవిష్యత్‌ని కాపాడతాయి. లేదంటే మొన్న చాలామంది పాపం డిసైడ్ అయ్యారు.. ఈసారి పాత పార్టీ వస్తే, మూటా ముల్లె సర్ధుకుని ఆంధ్రప్రదేశ్‌ని మర్చిపోయి హైదరాబాద్ వచ్చేద్దామని! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు అనే నమ్మకం కలుగుతోంది అంటే అది పవన్, చంద్రబాబుల జోడీ వల్లనే! 
 
ముఖ్యంగా మీరొక విషయం గమనించారో లేదో పవన్‌కి చంద్రబాబు అంటే చాలా గౌరవం, చంద్రబాబుకి పవన్ అంటే అంతే ప్రేమ.. లోకేష్ ఏ అరమరికలు లేకుండా వారితో కలిసిపోవడం ఇది చూడడానికి ఎంత హృద్యంగా ఉందో కదా! ఉన్నతమైన ఆలోచనలు కలిగిన పవన్ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
 
ఇట్లు.. 
ఓ వీరాభిమాని..