సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (21:54 IST)

ఉప్మా పద్మనాభం అంటున్నారట: పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని ఇబ్బందుల్లో ముద్రగడ

Mudragada Padmanabham
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఓడిస్తాననీ, ఆయన ఒకవేళ గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం శపథం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆయన నామకరణం చేస్తున్నామంటూ జనసైనికులు సోషల్ మీడియాలో ఇన్విటేషన్ రెడీ చేసి షేర్ చేస్తున్నారు. అందులో ఉప్మా, కాఫీలు అందించబడతాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
 
అదలావుంటే... కొంతమంది ఒకడుగు ముందుకు వేసి... ముద్రగడ పద్మనాభం అనే దానికి బదులు ఉప్మా పద్మనాభం అంటూ పేర్కొంటున్నారట. దీనిపై ముద్రగడ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మా తాతముత్తాతల మా ఇళ్లకు ఎవరైనా బంధువులు వస్తే మర్యాద చేస్తూ వారికి ఉప్మాలు, కాఫీలు ఇవ్వడం అలవాటు. అతిథులకు మర్యాద చేస్తే తప్పా? నన్ను ఉప్మా పద్మనాభం అనేవారు పలావులు పెట్టి పలావు పవన్ అవ్వండి అంటూ సెటైర్లు వేసారు. తనను ఉప్మా పద్మనాభం అంటే మాత్రం ఒప్పుకోను అంటూ గట్టిగా చెప్పారు.