శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (10:49 IST)

Valentines Day Special: దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ వాలంటైన్స్ డే విషెస్ (video)

Valentines Day Special
Valentines Day Special
దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాలంటైన్స్ డే సందర్భంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ ప్రేమ పక్షులు ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమికులకు  దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ జంట చేసిన వీడియో ఒక‌టి ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ల‌వ్ ప్ర‌పోజ్ చేసుకోవ‌డం, ఇంకా ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు, ఇచ్చుకున్న కానుకలు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతాయి. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు.
 
ఇకపోతే.. మాధురి ఒక డ్యాన్సన్ టీచర్ అని.. మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని దువ్వాడ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని దువ్వాడ చెప్పారు. తన కుమార్తెలను చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నీ తానై తనకు మాధురి సపర్యలు చేసిందని వెల్లడించారు.