శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2025 (17:19 IST)

కాంచీపురం వకుళ సిల్క్స్.. దివ్వెల మాధురి కొత్త వ్యాపారం (video)

divvela madhuri
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని సన్నిహితురాలు దివ్వెల మాధురి తరచుగా మీడియా దృష్టిలో ఉంటారు. వారి వ్యక్తిగత విషయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ భారీ స్థాయిలో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారని, ఈ వెంచర్‌లో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారని సమాచారం.
 
హైదరాబాద్‌లోని చందానగర్‌లో తమ మొదటి షోరూమ్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 21న ప్రారంభోత్సవం జరగనుందని టాక్. సాంప్రదాయ పట్టు వస్త్రాలపై దృష్టి సారిస్తూ షోరూమ్‌కి "కాంచీపురం వకుళ సిల్క్స్" అని పేరు పెట్టారు.
 
చందానగర్లో కొత్త దుకాణాన్ని ప్రారంభించిన వెంటనే హైదరాబాద్‌లో మరో వస్త్ర దుకాణంతో పాటు, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోనూ తమ మాల్స్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నారు.
 
పట్టు చీరల కలెక్షన్స్ కోసం ఇప్పటికే కోల్‌కతా, బెనారస్, ధర్మవరం, కంచి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాలు తిరుగుతూ తమకు నచ్చిన పట్టు చీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేశారు.