శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (10:46 IST)

మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఆ పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందన్నారు. పార్టీపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జనసేన పార్టీని తక్కువ అంచనా వేయొద్దని ఈ సందర్భంగా నాదెండ్ల చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేన సైనికులు బలంగా ఉన్నారన్నారు.
 
తిరుపతి ఉపఎన్నికపై స్పష్టమైన అవగాహన ఉందని త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు నిర్ణయంలో అంతిమ విజయం ప్రజలదేనని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని మనోహర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పార్టీ నేతలతో కలిసి పవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.