శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (14:25 IST)

జగన్‌ వంద రోజుల పాలనలో 30 మార్కులు కూడా తెచ్చుకోలేదు.. డొక్కా

సీఎం జగన్ నూరు రోజుల పరిపాలన వంద తప్పటడుగులు వేసిందని.. వంద తడబాట్లుగా వుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన తప్పటడుగులతో రాష్ట్రం తిరోగమనం అవుతుందని, ఇసుకలో, కాంట్రాక్టులలో యాబై శాతం ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చట్టం చేశారు. ఇప్పటి వరకు యాబై శాతం ఎంత మంది యస్సీ, యస్టీలకు ఇచ్చారొ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఇసుక టెండర్లలో ఎంత మంది ఎస్సీ యస్టీలకు యాభై శాతం ఇచ్చారో చెప్పాలి. రివర్స్ టెండరింగ్లో హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఇసుక కొరతతో  అణగారిన వర్గాలకు చెందిన వారే ఇబ్బందులకు గురౌతున్నారని గుర్తు చేశారు. 
 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులు పనులు లేక ప్రజలు రోడ్డున పడ్డారు. వందరోజులు పని నష్టపోయిన వారిని ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందని ప్రశ్నించారు.

వంద రోజుల పాలనలో ముప్పై మార్కులు కూడా తెచ్చుకోలేక ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. తప్పటడుగుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు.