గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (10:12 IST)

28న రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణేం

ntramarao
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు ఎన్టీఆర్- నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఈ నెల 28న ఆర్బీఐ 100 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రత్యేక నాణేన్ని రాష్ట్రపతి భవన్‌లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నందమూరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. 
 
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెం తయారు చేసింది. ఎన్టీఆర్ ముఖంతో నాణేల విడుదల కార్యక్రమం నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 
 
ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.