బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (16:05 IST)

స్కంద చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు అతిథిగా బాలయ్య

balakrishna
హీరో రామ్  - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌‍లో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య రిలీజైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో సెప్టెంబరు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.
 
ఈ క్రమంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన "అఖండ" చిత్రం భారీ విజయం సాధించిన తెలిసిందే. ఈ నేపథ్యంలో "స్కంద" కోసం అఖండ వస్తున్నాడంటూ ఇరువురు హీరోల ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ వారసుడు ఆయనే...
 
ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఇపుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలో తదుపరి నేత ఎవరు అన్నది ఇపుడు చాలా మందిలో ఉత్పన్నమైన ప్రశ్న. మోడీ తర్వాత బీజేపీలో ఆ బాధ్యతలను అందుకునేది ఎవరు, మోడీ రాజకీయ వారసుడు ఎవరు అనే విషయాలపై ఇప్పటికే చర్చ జరుగుతుంది. 
 
ఈ అంశానికి సంబంధించి ఇండియా టుడే - సీఓటర్ సంస్థలు తాజాగా ఓ సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో ప్రధాని మోడీ తర్వాత అత్యధిక ప్రజాదారణ కలిగిన నేతగా కేంద్ర హోం అమిత్ షా నిలిచారు. మోడీ తర్వాత ప్రధాని పదవిలో ఎవరిని చూడాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు 29 మంది ఓటర్లు అమిత్ షా పేరును చెప్పారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును 26 శాతం మంది, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 15 శాతం మంది చొప్పున మొగ్గు చూపారు.