గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (12:50 IST)

నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై పాట చిత్రీకరణ

Kajal and seeleela dance practice
Kajal and seeleela dance practice
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్' భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైయ్యే భారీ అంచనాల సినిమాలలో ఒకటి.
 
ప్రస్తుతం 'భగవంత్ కేసరి' షూటింగ్ హైదరాబాద్‌ ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల ప్రధాన తారాగణంపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రధాన తారాగణం అంతా కనిపించబోయే ఈ పాటను బిగ్ స్క్రీన్స్ పై చూడటం కన్నుల పండువగా ఉంటుంది.
 
'భగవంత్ కేసరి' యునిక్ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ గా వుంటుంది. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి  ప్రజంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది.  
 
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన విలన్‌గా కనిపించనున్నారు.  
 
ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల