శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (16:02 IST)

మగధీరలో కాజల్ అగర్వాల్ ఎంత అందంగా ఉందొ ఇప్పుడు సత్యభామగా అంతే అందంగా ఉంది : శేఖర్ కమ్ముల

Sasikiran Thikka, Shekhar Kammula, Kajal Aggarwal
Sasikiran Thikka, Shekhar Kammula, Kajal Aggarwal
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమాకు "సత్యభామ" టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. "మేజర్" చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Sasikiran Thikka, Shekhar Kammula, Kajal Aggarwal, Bobby Thikka
Sasikiran Thikka, Shekhar Kammula, Kajal Aggarwal, Bobby Thikka
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రావు తక్కలపల్లి మాట్లాడుతూ - ఇవాళ మా సంస్థ ఆరమ్ ఆర్ట్స్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఆరమ్ అంటే బంగారం అని అర్థం.  ఈ చిత్రంతో పాటు మా సంస్థలో రాబోయే చిత్రాలన్నీ బంగారంలా ఉంటాయి. "సత్యభామ" గ్లింప్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల గారికి థాంక్స్. అలాగే మా ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న కాజల్ కు థాంక్స్. అన్నారు.
 
చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే అందించిన శశికిరణ్ తిక్క మాట్లాడుతూ - నేను శేఖర్ కమ్ముల గారి దగ్గర పనిచేశాను. సినిమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని శేఖర్ గారు చెబుతుండేవారు. నేనూ అదే ఫాలో అవుతున్నాను. ప్రొడక్షన్ సైడ్ వచ్చినప్పుడు ఫీమేల్ ఒరియెంటెడ్ సబ్జెక్ట్ చేయాలనుకున్నాను. కాజల్ ను అప్రోచ్ అయ్యా. ఆమె కథ విని ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాం. కానీ ఆమె సంతోషంగా అంగీకరించింది. ఫిల్మ్ స్కూల్ లో గ్రాడ్యూయేట్ చేసిన అఖిల్ ను దర్శకుడిగా ఎంచుకున్నాం. తన వర్క్ మాకు అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమా ఒక యూనిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
దర్శకుడు అఖిల్ డేగల మాట్లాడుతూ - దర్శకుడు శేఖర్ గారికి అభిమానిని. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటాం. ఆరమ్ ఆర్ట్స్ సంస్థలో మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమా హీరో కాజల్ గారికి థాంక్స్. ఈ సినిమా జర్నీలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చింది శశికిరణ్ గారు. స్టోరీ సెలెక్షన్ దగ్గర నుంచి షూటింగ్ వరకు ప్రతి విషయంలో సపోర్ట్ ఇచ్చారు. మంచి టీమ్ నాకు దొరికింది. వారి సహాయంతో మంచి సినిమా చేశానని అనుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ - "లీడర్" సినిమాకు నా దగ్గర శశికిరణ్ పనిచేశాడు. తను దర్శకుడిగా మారి రెండు పెద్ద చిత్రాలను రూపొందించాడు. "మగధీర"లో మిత్రవిందగా కాజల్ ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. ఇప్పుడూ అంతే అందంగా ఉంది. పెళ్లయినా నాయికలు తమ కెరీర్ కొనసాగించాలి అనేందుకు కాజల్ నిదర్శనం. "సత్యభామ" గ్లింప్స్ చూశాను. అందులో కాజల్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.
 
 
హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - తెలుగు సినిమా నాకు పుట్టినిల్లు లాంటిది. టాలీవుడ్ లో మళ్లీ నటిస్తుండటం ఆనందంగా ఉంది. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో హీరోయిన్స్ ను ఎంతో పవర్ ఫుల్ గా చూపిస్తారు. ఆయన సినిమాలను ఇష్టపడతాను. నా పుట్టిన రోజున మా టీమ్ ఫస్ట్ గ్లింప్స్ తో సర్ ప్రైజ్ చేయడం సంతోషంగా ఉంది. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఎప్పటికీ గుర్తుండే ఒక మంచి సినిమాను అందిస్తాం. అన్నారు.