సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (12:26 IST)

సినిమాలకు బైబై చెప్పేయనున్న చందమామ?

Kajal Agarwal
తమిళ సినీ ప్రముఖ నటీమణులలో ఒకరైన నటి కాజల్ అగర్వాల్ పలువురు ప్రముఖ నటులతో కలిసి నటించారు. తమిళ చిత్రసీమలోనే కాకుండా తెలుగు, కన్నడ వంటి ఇతర భాషా చిత్రాల్లోనూ నటించి అక్కడ కూడా మెయిన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. 
 
అయితే, లాక్‌డౌన్ సమయంలో, ఆమె వ్యాపారవేత్త గౌతం కిచ్లును వివాహం చేసుకుంది. ఇటీవలే వీరికి మగబిడ్డ పుట్టాడు. పాపకు నీల్ కిచ్లు అని పేరు పెట్టారు. ఇప్పుడు మళ్లీ సినిమాపై దృష్టి సారించిన కాజల్ అగర్వాల్ చేతిలో భారతీయుడు 2, బాలయ్య భగవత్ కేసరి అనే రెండు సినిమాలు ఉన్నాయి. 
 
ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాత సినిమా నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన బిడ్డతో ఎక్కువ సమయం గడపడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.