ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (16:53 IST)

ఫస్ట్ టైం 108 భారీ హోర్డింగ్స్ తో నందమూరి బాలకృష్ణ చిత్రం టైటిల్ ప్రకటన

108 hordings
108 hordings
నందమూరి బాలకృష్ణ 108వ సినిమా. అనీల్ రావిపూడి దర్శకుడు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు. అందుకే వినూత్నంగా టైటిల్  ప్రకటన చేస్తుంది చిత్ర యూనిట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 108 ప్రాంతాల్లో 108 భారీ హోర్డింగ్స్ తో టైటిల్ ని జూన్ 8న లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 
 
ఈ సినిమా పూర్తి యాక్షన్ చిత్రం. సమకాలీన రాజకీయాలు, సెంటిమెంట్, ఎంటర్ టైన్మెంట్ అంశాలతో ఉంటుందని ఇదివరకే దర్శకుడు అనీల్ రావిపూడి చెప్పారు. ఏప్.3 సినిమా తర్వాత తాను చేస్తున్న చిత్రం ఇదే. అఖండ తర్వాత ఆ స్థాయిలో ఉండేలా కథను మలిచారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీ లీల  కీలక పాత్రలో నటించింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.