శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 జూన్ 2023 (23:25 IST)

పులిచింత ఆకు పచ్చడి తింటే?

pulichinta
పులిచింత ఆకు. ఈ చెట్టు ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆకులతో మూత్ర నాళాల రుగ్మతలకు చికిత్స చేస్తారు. శ్వాస సమస్యలను తొలగిస్తుంది. నిద్రలేమికి మేలు చేస్తుంది, కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము. పులిచింత ఆకు రసంతో కాస్తంత సైంధవ లవణం కలిపి పూస్తే పులిపిర్లు రాలిపోతాయి. పులిచింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు గట్టిపడతాయి.
 
పులిచింత మొక్క వేళ్లను నీడన ఎండించి పొడి చేసి పండ్ల పొడిగా వాడినా చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. సైందవ లవణం చేర్చిన పులిచింత ఆకు రసాన్ని తేలు కుట్టిన చోట రుద్దితే చాలా త్వరగా విషం దిగిపోతుంది. పులిచింత ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది. 

40 నుంచి 60 మి.లీ ఆకు రసంలో పొంగించిన ఇంగువ కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది. 
పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది.
ఐదారు పులిచింత ఆకులను బాగా నమిలి మింగేస్తే నోటి దుర్వాసన దూరం అవుతుంది.