శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (17:09 IST)

పవర్ ఫుల్ పాత్రలో కాజల్ అగర్వాల్ 60వ సినిమా గ్లింప్స్ రాబోతుంది

Kajal Aggarwal 60th Movie
Kajal Aggarwal 60th Movie
కాజల్ అగర్వాల్ మరొక సినిమా తో తిరిగి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తన నెక్స్ట్ చిత్రం #కాజల్ 60 లో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో వెండి తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉంది. తాజాగా జూన్ 19 న ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు రేపు ఒక గ్లింప్స్ వీడియో ను విడుదల చేయనున్నారు.
 
అఖిల్ డేగల సినిమా కి దర్శకత్వం వహించారు.  ఇందులో కాజల్ మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కనిపించనుంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని తమ ప్రొడక్షన్‌ లో మొదటి సినిమా గా నిర్మిస్తున్నారు. సినిమా సమర్పకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.