ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (16:11 IST)

అల్లరి నరేశ్‌ ఉగ్రరూపం ఎలా వుందో ఉగ్రం రివ్యూలో చూద్దాం

ugram action
ugram action
నటీనటులు: అల్లరి నరేష్-మిర్నా-శరత్ లోహితశ్వ-శత్రు-ఇంద్రజ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం: సిద్దార్థ్, కథ: తూమ్ వెంకట్, మాటలు: అబ్బూరి రవి, నిర్మాత: సాహు గారపాటి-హరీష్ పెద్ది, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కనకమేడల
 
నాంది సినిమాతో నరేశ్‌ను సీరియస్‌గా చూపించి సక్సెస్‌ సాధించిన దర్శకుడు విజయ్‌ కనకమేడల ఇప్పుడు ఉగ్రం సినిమా తీశాడు. మిస్సింగ్‌ కేసుల నేపథ్యంలో కథ సాగుతుందనీ, వార్తల్లో వచ్చిన ఆర్టికల్స్‌ బట్టి కథ రాసుకున్నాయని చెప్పిన దర్శకుడు ఎలా తీశాడో చూద్దాం.
 
కథ:
శివ (అల్లరి నరేశ్‌) ట్రైనీ పోలీసుగా వుండగానే అపర్ణను (మీర్నా)ను ప్రేమిస్తాడు. అపర్ణ సాధారణ పోలీస్‌ను ప్రేమించడం ఇష్టంలేని గంజాయి వ్యాపారంచేసే ఆమె తండ్రి అపర్ణకు బలవంతంగా పెండ్లి చేయాలని చూస్తాడు. చివరినిముషంలో శివ వచ్చి అపర్ణను తీసుకెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడిశాక తన స్టేషన్‌ పరిధిలోని మిస్సింగ్‌ కేసులను శోదించే పనిలో వుంటాడు. మరోవైపు గురుకుల హాస్టల్‌లో యువతులను నలుగురు కుర్రాళ్ళు అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. వారిని తగిన విధంగా శివ శిక్షిస్తాడు. అయితే మిస్సింగ్‌ కేసుల విషయంలో లోతుగా వెళ్లేక్రమంలో యాక్సిడెంట్‌ గురయి శివ మానసికస్థితి కోల్పోతాడు. ఆ తర్వాత అపర్ణ, ఆమె కుమార్తె కూడా మిస్‌ అవుతారు. ఆసుపత్రిలో కోలుకున్న శివకు తన కుటుంబం మిస్‌ అయిందని తెలుసుకుని షాక్‌ కు గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
ఉగ్రంలో మొదటి పార్ట్‌లో గురుకులాల దగ్గర గంజాయితాగే వారి ఆగడాలు వంటివి ఇటీవలే పేపర్లలో కూడా వచ్చాయి. ఆ కాన్సెప్ట్‌ను తీసుకున్నాడు దర్శకుడు అయితే ఇది మొదటి పార్ట్‌వరకే పరిమితం. కానీ ఆ తర్వాత అసలు మిస్సింగ్‌కేసుల వెనుక భారీ నెట్‌ వర్క్‌ వుంటుంది. అందులో హిజ్రాల ముసుగులో వచ్చిన దుండగులుచేసే ఆగడాలే ఈ కిడ్నాప్‌లు. అలా కిడ్నాప్‌ చేసిన వారిని ఏమి చేస్తారనేది ఆసక్తికర పాయింట్‌. 
 
ఈమధ్య కథలు మెడికల్‌ మాఫియా చుట్టూ తిరుగుతున్నాయి. అవి సినిమాల ద్వారా తెలుసుకుంటే ఒళ్లు జలతరిస్తుంది. ఇలాంటి ప్రయోగాలు మనుషులపై జరుగుతున్నాయా? అనిపిస్తుంది. అలాంటి వాటిల్లో కొత్త ప్రయోగం ఈ సినిమాలోని కథ. మనిషిలోని బ్లడ్‌ను రీప్రొడ్యూస్‌ చేసే విధంగా ఓ వ్యక్తి చేసే ప్రయోగమే సెకండాఫ్‌. మొదటి పార్ట్‌, రెండో పార్ట్‌లోని పాయింట్లతో రెండు సినిమాలు తీయవచ్చు అనిపిస్తుంది. 
 
మొదటి భాగంలో కథంతా హీరో కుటుంబంపైనే టార్గెట్‌ చేసే సన్నివేశాలతో దర్శకుడు రాసుకున్నాడు. అయితే గంజారు తాగి అల్లరిచేసే యువతను టార్గెట్‌ చేసే విధానం కొత్తగా వున్నా సమంజసంగా అనిపిస్తుంది. సమాజంలో జరిగే అక్రమాలకు, అన్యాయాలకు కథను తగినవిధంగా రాసుకున్నాడు. సంభాషణలు కూడా పొందికగా వున్నాయి. ఏది చేసినా సి.ఐ.గా తనపరిధిలోనే చేసి పెద్ద డ్రెగ్‌మాఫియాను తుదముట్టించడంఅనేది సినిమాటిక్‌గా చూపించారు. పై అధికారులకు ఏమాత్రం తెలవకుండా చేసి అందుకు లాజిక్‌గా ఎస్‌.ఐ.కు వున్న పవర్‌ను ఉపయోగించడం చూపించారు.
 
సీరియస్‌ కథ కాబట్టి పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సంగీతానికి ప్రాధాన్యత వుంది. బ్యాక్‌డ్రాప్‌ మ్యూజిక్‌ సినిమాకు ఆకర్షణ. సినిమాటోగ్రఫీ కీలకం. నటీనటులపరంగా అందరూ బాగానే చేశారు. టెక్నికల్‌గా పోలీసు డిపార్ట్‌మెంట్‌ సి.సి. కెమెరాలతో ఎలా ఉపయోగించుకుంటుందో ఇందులోనూ అలా చూపించాడు. 
 
నరేశ్‌ మరోసారి సీరియస్‌ పాత్రలో మెప్పించాడు. హీరోయిన్‌గా కథానాయిక ఓకే అనిపిస్తుంది. శత్రు పాత్ర బాగానే చేశాడు. ఇంద్రజ డాక్టర్‌గా నటించింది.
 
ఈ కథను సెకండాఫ్‌లో సినిమాటిక్‌ ముగింపు ఇచ్చాడు. పబడ్బంధీ థ్రిల్లర్‌గానూ రాసుకునే అవకాశం వుంది. మొత్తంగా ఈ సినిమా కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. మంచి కథతో కమర్షియల్‌ హంగులతో తీసిన సినిమా ఇది. అందరూ చూడదగ్గసినిమా.