గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 2 మే 2017 (20:00 IST)

తిరుమలలో గంజాయి.. ఎంజాయ్ చేసిన హాకర్లు!!

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిపోతోంది. నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకెళ్ళకూడదన్న నియమాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా నిషేధిత వస్తువులను తరలించేస్తున్నారు. అందులోను తిరుమలలో గంజాయి దొరకడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాం

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిపోతోంది. నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకెళ్ళకూడదన్న నియమాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా నిషేధిత వస్తువులను తరలించేస్తున్నారు. అందులోను తిరుమలలో గంజాయి దొరకడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. కొంతమంది హాకర్లు గంజాయిని భక్తులు తిరిగే ప్రాంతంలోనే పీలుస్తూ కనిపించారు. రెండుగంటలకుపైగా ఈ వ్యవహారమంతా జరుగుతున్నా అన్నీ అయిపోయిన తరువాత తితిదే విజిలెన్స్, నిఘా అధికారులు ఆలస్యంగా వచ్చి పట్టుకున్నారు.
 
తిరుమలలోని లేపాక్షి ఎంపోరియం వెనుక భాగాన భక్తులు తిరిగే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గంజాయ్ సేవించారు. మత్తుగా పీలుస్తూ నలుగురు హాకర్లు ఎంజాయ్ చేశారు. దాంతోపాటు మద్యం బాటిళ్ళను పక్కనే పెట్టుకున్నారు. ఇదంతా భక్తులు తిరిగే ప్రాంతంలోనే జరిగింది. రెండుగంటకుపైగా ఎంజాయ్ చేసిన వీరిని స్థానికంగా ఒక భక్తుడు తితిదేకి సమాచారం అందించి పట్టించారు. తిరుమలకు గంజాయిని ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ తితిదే విజిలెన్స్ అధికారులకు అర్థం కాలేదు. ఎప్పుడూ నిఘా నీడలో ఉన్న తిరుమలలో నిషేధిత వస్తువులు తీసుకెళ్ళడం పరిపాటిగా మారుతోంది. తిరుమల లాంటి క్షేత్రంలో గంజాయి పట్టుబడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతోంది.