శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:39 IST)

పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ..

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ ఏర్పడింది. ఇందుకు కారణం బిర్యానీ. అవును. రూపాయికే దమ్ బిర్యానీ అంటే జనం ఎగబడతారుగా.. అదే జరిగింది. మార్కాపురం పట్టణంలో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అంతే బిర్యానీ ప్రియులు ఆగమేఘాల మీద రెస్టారెంట్ ముందు వాలిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. దీంతో తోపులాట జరిగింది.
 
జనం తాకిడికి తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ యాజమాన్యం మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేసింది. రెస్టారెంట్ ముందు జనం తోపులాటలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.