శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (09:25 IST)

ఏపీలో ఈ నెల 11 నుంచి దసరా సెలవులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దసరా సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఏపీలో ఈ నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్రకటించారు. 
 
ఇదిలావుంటే.. గతంలో పాఠశాలలకు దసరా సెలవులను ఆరు రోజులుగా ప్రభుత్వం ప్రకటించగా.. 9వ తేదీ రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. దీంతో అక్టోబర్ 8వ తేదీ వరకే పాఠశాలలు పని చేయనున్నాయి. అటు 17వ తేదీ ఆదివారం కావడంతో స్కూల్స్ 18న పునఃప్రారంభంకానున్నాయి. మొత్తం 9వ తేదీ నుంచి 17 వరకు(9 రోజులు) పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి.
 
అదేవిధంగా తెలంగాణలో బుధవారం నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకుంటాయని వెల్లడించింది. అలాగే ఈ నెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు ఇంటర్‌ కాలేజీలకు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి.