1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:18 IST)

తిరుపతిలో భూప్రకంపనలు - భూకంప లేఖినిపై 3.6

పవిత్ర పుణ్యక్షేత్రమై తిరుపతిలో భూకప్రకంపనలు సం1భవించాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతికి సమీపంలో భూకంపం సభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ) వెల్లడించింది. 
 
దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని తిరుపతికి ఈశాన్య దిశలో 85 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు ఎన్.సి.ఎస్ అధికారులు వెల్లడించారు. 
 
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్థరాత్రి పూట భూమి ఒక్కసారిగా కంపించడంతో భయంతో ఉలికిపాటుకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.