మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:50 IST)

అన్నంలో సైనేడ్ పెట్టి భర్త హత్యకు భార్య ప్లాన్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో ఓ దారుణం వెలుగుచూసింది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్ వేసింది. అన్నంలో సైనేడ్ పెట్టి హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఈ కుట్రలో కుమారుడు కూడా భాగస్వామి కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని పోలసానిపల్లెలో గురునాథం - రాణి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్తతో భార్యకు గొడవలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా కుమారుడు సహాయంతో భర్తను హత్య చేసేందుకు భార్య రాణి ప్లాన్ చేసింది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, భర్త తినే అన్నంలో సైనేడ్ కలిపి పెట్టింది. భోజనానికి కూర్చున్న గురునాథానికి అనుమానం వచ్చి అన్నం తినకుండా ప్రాణాలు రక్షించుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్యను, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.