భార్య అక్రమ సంబంధం బయటపెట్టేందుకు సి.సి. కెమెరాలు పెట్టిన భర్త.. ఆ తరువాత?

cc tv camera
జె| Last Modified శనివారం, 15 ఫిబ్రవరి 2020 (16:15 IST)
తన వేరొకరితో కలిసి ఉందన్న అనుమానం భర్తలో కలిగింది. భార్యను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుందామనుకున్నాడు. విషయాన్ని తన తల్లికి చెప్పాడు. ఆమె సలహాతో ఆఫీస్‌లో సి.సి.కెమెరాలు పెట్టించాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చే
భార్యపై అనుమానం బాగానే పెంచుకున్నాడు. విషయం కాస్త భార్యకు తెలియడంతో ఆమె భర్త, అత్తపై కోపంతో ఊగిపోయింది. ఇద్దరిని కలిపి చితకబాదింది.

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఆకాష్, ఇషితలకు ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆకాష్‌ చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తున్నాడు. ఇషిత కూడా ఛార్టెడ్ అకౌంటెంట్. భార్యను బిజినెస్ పార్టనర్‌గా చేసుకున్నాడు. అయితే ఆ ఆఫీస్‌లో పనిచేసే ఒక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తలో అనుమానం ఏర్పడింది.

దీంతో వారంరోజుల పాటు ఆఫీస్‌కు వెళ్ళకుండా సి.సి.కెమెరాలు పెట్టి అందులో నుంచి చూడటం మొదలెట్టాడు. ఉన్నట్లుండి ఆఫీస్‌లో సి.సి.కెమెరాలు రావడం.. ఆఫీస్‌కు అస్సలు రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా అత్త నుంచి సూటిపోటి మాటలు రావడంతో ఆమెలో కోపం మరింత పెరిగింది.

నిన్న రాత్రి ఆఫీస్ నుంచి రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చింది. కరెంట్ పోవడంతో సి.సి.కెమెరాలు నిలిచిపోయాయి. అయితే తన భార్యే సి.సి. కెమెరాలను పనిచేయకుండా చేసిందన్న అనుమానంతో ఆకాష్ ఆమెను నిలదీశాడు. అత్త కూడా అందుకు వంతపాడింది. దీంతో ఇషితకు కోపం కట్టలు తెంచుకుంది. భర్తపై దాడి చేస్తూ అత్తను పక్కకు నెట్టేసింది. దీంతో ఆమె తలుపుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్తను కూడా చీపురుతో చెడామడా వాయించేసింది. దీంతో భర్త, అత్త ఇద్దరూ కలిసి పోలీస్టేషన్లో ఇషితపై ఫిర్యాదు చేశారు.దీనిపై మరింత చదవండి :