హార్దిక్ పటేల్ కనిపించట్లేదు... భార్య కింజాల్ పటేల్ ఆందోళన

hardik patel
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (10:39 IST)
గుజరాత్ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపిన యువనేత హార్దిక్ పటేల్. పాటిదార్ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ యువ రాజకీయ నేత.. గత 20 రోజులుగా కనిపించడం లేదట. ఈ విషయాన్ని ఆయన భార్య కింజాల్ పటేల్ వెల్లడించి, తన భర్త పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ మేరకు కింజాల్ మాట్లాడిన వీడియోను అంతర్జాలంలో పెట్టారు. 2017లో పాటిదార్ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి, తన భర్త ఒక్కడినే లక్ష్యంగా చేశారని ఆమె ఆరోపించారు. గతంలో పాటిదార్ ఉద్యమంలో పనిచేసిన మరో ఇద్దరు బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తి వేశారని కింజాల్ పేర్కొన్నారు.

ప్రజల సమస్యలపై హార్దిక్ పటేల్ స్పందించకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని కింజాల్ ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హార్థిక్ పటేల్‌ను జైలుకు పంపించేందుకు గుజరాత్ సర్కారు కుట్ర పన్నిందని కింజాల్ ఆందోళన వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :