బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జులై 2024 (16:49 IST)

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం- కాల్వలో తోసేసి వెళ్లిపోయారు..

నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై  విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే.. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. 
 
జాగిలాలను రంగంలోకి దింపడంతో ఈ ఘోరం బయటపడింది. మూడో తరగతి చదువుతున్న బాలిక మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ కేసులో తొలుత ఎలాంటి ఆధారాలు దొరకలేదు. 
 
దీంతో జాగిలాలను రంగంలోకి దించారు. శునకాల ఆధారంగా ముగ్గురు బాలుర వద్ద విచారణ జరపగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆ తర్వాత భయపడి బాలికను చంపి కాల్వలో పడేశామని పోలీసులకు చెప్పారు. దీంతో బాలిక మృతదేహం కోసం పోలీసులు కాల్వలో గాలిస్తున్నారు. ముగ్గురు నిందితులూ పన్నెండు, పదమూడేళ్ల వయసున్న వారే, అయినప్పటికీ ఇంత ఘోరానికి పాల్పడడం గ్రామస్థులను నివ్వెరపరిచింది.