ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (16:17 IST)

ఏలూరు కార్పొరేషన్‌లో వైకాపా జెండా - 47 చోట్ల ఘన విజయం

వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్)కు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఓట్ల లెక్కింపు ఫలితాల్లో అధికార వైసీపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. 
 
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 47 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. 
 
ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయభేరి మోగించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క డివిజన్‌లోనూ గెలుపు దక్కలేదు. అధికార వైసీపీ ధాటికి విపక్ష టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.