మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (13:28 IST)

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తిరుపతి లోక్‌సభ సభ్యుడు

ఇటీవల లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజునే ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. ఈయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఆ తర్వాత ఇటీవల ఎంపీకైన కొత్త మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ సభకు పరిచయం చేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించారు. కాగా, తొలిరోజు(సోమవారం) లోక్‌సభలో 2 బిల్లులు.. ది ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ ప్రెన్యూర్షిప్, మేనేజ్‌మెంట్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 
 
పార్లమెంట్‌ సమావేశాలు ఉదయం 11గంటకు ప్రారంభమై సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతాయి. నేటి నుంచి ఆగస్టు 13వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19సార్లు సభ సమావేశం అవుతుంది.