శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (18:58 IST)

కాస్ట్యూమ్స్‌ కోసం మూడు కోట్ల రూపాయల ఖర్చు.. ఒక్క పాట కోసం..?

పాన్‌ ఇండియా మూవీగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అప్‌డేట్‌ ఏది వచ్చినా.. హాట్‌ టాపిక్‌గా మారిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో ఒక్కపాట మూడు కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ పాట కోసం రాజమౌళి రామోజీఫిల్మ్‌సిటీలో భారీ సెట్‌ సిద్ధం చేశారని.. ఇందులో అలియాభట్‌ సందడి చేయనున్నారని తెలుస్తోంది. 
 
రాజమౌళి తెరకెక్కించే చిత్రాల్లో హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ భారీ బడ్జెట్‌ సాంగ్‌ కాస్ట్యూమ్స్‌ కూడా దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు చేయనున్నారట. ఒక్క పాట కోసమే మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడమంటే.. బహుశా భారతీయ సినిమా పరిశ్రమలోనే ఇదే మొదటిది కావొచ్చు అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ వార్తల్లోని నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.
 
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ రెండు పాటలు మినహా మొత్తం పూర్తయినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. దీంతో చిత్రయూనిట్‌ ముందే ప్రకటించినట్లుగా ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌ 13న దసరా కానుకగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.