సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (14:49 IST)

యూట్యూబర్ దాసరి విజ్ఞాన్‌పై మాజీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి ఫిర్యాదు (video)

shanthi
ఇప్పటికే హర్ష సాయి అనే యూట్యూబర్‌పై లైంగిక దాడి కేసు నమోదైన నేపథ్యంలో.. తాజాగా మరో యూట్యూబర్ దాసరి విజ్ఞాన్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ తనపై లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్నారంటూ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎండోమెంట్ కమిషనర్ శాంతి ఫిర్యాదు చేశారు. 
 
మార్ఫింగ్ వీడియోలు పోస్టు చేసి వేధిస్తున్నాడని శాంతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దాసరి విజ్ఞాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
Youtuber Dasari Vigyan
Youtuber Dasari Vigyan


హర్ష సాయికి సహకరిస్తున్న దాసరి విజ్ఞాన్‌పై ఇప్పటికే ఆరు కేసులు ఉన్నట్టు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు. దాసరి విజ్ఞాన్‌పై సెక్షన్ 72 బీఎన్ఎస్, 356 (1) బీఎన్ఎస్ 67 of ఐటీ యాక్ట్ 2008 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.