శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (17:53 IST)

ఈఎస్ఐ స్కామ్ : దేవికారాణి ఆస్తుల చిట్టా ఇదే...

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కీమ్ ఈఎస్ఐ కుంభకోణం. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు దేవికారాణి. ఆమె ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ స్కామ్ ద్వారా ఆమె రూ.కోట్లకు పడగలెత్తినట్టు తెలుస్తోంది. 
 
ఈమె తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీగా స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. దేవికారాణి అక్రమాల్లో సహకరించిన ఆమె భర్త గురుమార్తి (రిటైర్డ్ సివిల్ సర్జన్). నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో రూ.34 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు గుర్తింపు. వేర్వేరు 23 బ్యాంకుల్లో రూ.కోటి 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. 
 
దేవికారాణి ఇంట్లో రూ.25.72 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. అలాగే, దేవికారాణి ఇంట్లో రూ.8.40 లక్షల నగదు, రూ.7 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశారు. రూ.20 లక్షల ఇన్నోవా కారు, 60 వేల మోటర్ బైక్ సీజ్.. వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు.. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లపై మాటే. పీఎంజే జ్యువెల్లర్స్‌కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు ఏసీబీ వెల్లడించింది.