పిఠాపురంలో జగన్‌కు స్వాగతం పలికింది నకిలీ కాపులా?
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు కాపుల సెగ తగులుతూనే ఉంది. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని జగన్ ప్రకటించాలని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి కొందరు కాపు సామాజికవర్గ నే
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు కాపుల సెగ తగులుతూనే ఉంది. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని జగన్ ప్రకటించాలని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి కొందరు కాపు సామాజికవర్గ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారని, జగన్‌ను సన్మానించేందుకు వచ్చిన కాపు నేతలతో వైయస్ జగన్ మాట్లాడినట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేతలు నిజంగా కాపు నేతలు కాదని, వారిని తమ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదంటూ వాపోతున్నారు స్థానిక కాపులు. ఈ నకిలీ కాపులను ఎక్కడ నుంచి తీసుకొచ్చారో వైసీపీ పార్టీకే తెలియాలంటున్నారు. ఇందులో నిజమేమిటో అవాస్తవమేమిటో తేలాల్సి వుంది మరి.