మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (13:20 IST)

ఆ తండ్రికి ఏం కష్టమొచ్చిందో... కుమార్తె, కుమారుడికి విషమిచ్చి.. అతనూ తాగాడు.. ఎక్కడ?

ఆ తండ్రికి ఎలాంటి కష్టమొచ్చిందో ఏమో తెలియదు. తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తాను కూడా సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని సంబటూరులో జరిగింది. ఈ వివరాలను

ఆ తండ్రికి ఎలాంటి కష్టమొచ్చిందో ఏమో తెలియదు. తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తాను కూడా సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని సంబటూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ప్రొద్దుటూరులోని నాగేంద్ర నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ రెడ్డికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉంది. ఈయన శెనగలు, వరి ధాన్యం కమీషన్‌ వ్యాపారం చేస్తూ భార్యాపిల్లలను పోషిస్తూ వస్తు్నాడు. మేనత్త కూతురు రమాదేవిని పెళ్లి చేసుకోవడంతో పిల్లల ఆరోగ్యం సరిగా లేదు. ఈక్రమంలో ఐదేళ్ల క్రితం వీరికి ఆనారోగ్యం చేయడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లారు.
 
పరీక్షించిన అక్కడి వైద్యులు పిల్లలిద్దరికి 20 ఏళ్లు వచ్చిన తర్వాత మంచాన పడతారని, నడవలేరని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర కలత చెందారు. అప్పట్లోనే ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత రమాదేవి శీతలపానీయంలో శెనగ గుళికలు కలిపి తాను తాగి పిల్లలకు తాపించింది. దీంతో రమాదేవి చనిపోగా.. ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో.. చంద్రశేఖర్ రెడ్డి ముద్దనూరుకు చెందిన కవిత అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఏడాదిన్నర తర్వాత విఘ్నేశ్వరుడు అనే కుమారుడు జన్మించాడు. గత కొన్నినెలల నుంచి చంద్రశేఖర్‌రెడ్డి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో పిల్లల పరిస్థితి తలచుకుని దీనంగా రోదించేవాడు. ఈ క్రమంలో గురువారం కాలేజిలో ఉన్న కుమారుడు మంజునాథ రెడ్డిని, పాఠశాలలో ఉన్న హన్సికలను మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటికి తీసుకొచ్చాడు. 
 
వారిని మోటార్‌ బైక్‌లో కూర్చోబెట్టుకుని సంబటూరు సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లాడు. అక్కడ ముందే విషం కలిపిన మాజాను పిల్లలకు తాగిపించి తాను కూడా తాగాడు. వీరు ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం ముగ్గురు ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.