శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (12:38 IST)

విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఎలా వచ్చాయంటే..?

railway track
విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి. అప్రమత్తమైన కొందరు చైన్ లాగి రైలును ఆపేశారు. కొందరు ప్రయాణికులు పొగ వస్తున్న చోటుకి వెళ్లి చూస్తే ఓ సంచిలోని బాణసంచా నుంచి పొగలు రావడం కనిపించింది. వెంటనే ఓ వ్యక్తి కాలితో తొక్కి సంచిని బయటకు తోసేశాడు. 
 
సకాలంలో పొగను నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. సంచిలోని బాణసంచా మొత్తం అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదన్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది బోగీని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రైలు బయల్దేరింది.