ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (11:15 IST)

పగో జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి

blast
వెస్ట్ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్న కడియద్ధ వద్ద బాణా సంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో పది మందికి గాయాలయ్యాయి. 
 
వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నాయి. పేలుడు సంభవించిన ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.