శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (12:14 IST)

నేడు చంద్రబాబుకు కంటి ఆపరేషన్.. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో అడ్మిట్

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మంగళవారం కంటి ఆపరేషన్ జరుగనుంది. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు ప్రత్యేక వైద్యుల బృంద క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనుంది. 
 
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ వచ్చిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌తో జైలు నుంచి విడుదలైన విషయం తెల్సిందే. తొలుత విజయవాడ నివాసానికి వెళ్లి.. అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. 
 
రెండు రోజుల పాటు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు మంగళవారం కంటి ఆపరేషన్‌ చేయనున్నారు. కాగా, సోమవారం కూడా ఏఐజీ ఆస్పత్రిలో వివిధ రకాలైన వైద్య పరీక్షలతో పాటు చర్మ సంబంధిత చికిత్సను కూడా అందించినట్టు సమాచారం.