శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:51 IST)

3న రాజమహేంద్రవరంలో జప్తు వాహనాలు వేలం

రాజమహేంద్రవరంలో జప్తుచేసిన మోటారు సైకిళ్లు, ఆటోలు, గూడ్స్‌ ఆటోలు తదితర వాహనాలను మార్చి 3వ తేదీన ఉదయం 10.30కు రాజమహేంద్రవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు ఇన్‌ఛార్జి ఆర్టీవో ఎస్‌ఎస్‌ రంగనాయకులు తెలిపారు.

రాజమహేంద్రవరం ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో 44 వాహనాలు, గోకవరం ఆర్టీసీ బస్సు డిపోలో 11 వాహనాలు బహిరంగ వేలం వేస్తామన్నారు. ఆసక్తి కల్గిన వారు ముందుగానే ఆయా స్థలాల్లో ఉన్న వాహనాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారి తప్పనిసరిగా గుర్తింపు కార్డు నకలు దాఖలు చేయాలని పేర్కొన్నారు.

వేలం పాటలో పాల్గొనడానికి రూ.2,200లు డిపాజిట్‌గా చేయాల్సి ఉంటుందని, వేలం తర్వాత కట్టిన డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తామని తెలిపారు. వివరాల కోసం రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ రవాణాశాఖ అధికా రి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.