కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం
కాంగ్రెస్ పార్టీకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడుకి తన రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, దాన్ని అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన జై సమైక్యాంధ్ర అనే పార్టీని కూడా ఏర్పాటు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమైపోయారు.
అదేసమయంలో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయనకు ఏపీ శాఖ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అదేసమయంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇపుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చుతుంది.
దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ, కిరణ్ కుమార్ ఎంతో చుకురైన నాయకుడని, ఆయన తమ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కిరణ్ వంటి నేత వస్తే ఏపీలో బీజేపీ మరింతగా బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.