సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (16:51 IST)

కాంగ్రెస్ ప్లీనరీలో సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా...

sonia gandhi
కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభలు ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ సభలు మూడు రోజుల పాటు జరుగుతాయి. 
 
రెండో రోజు శనివారం ఈ సభలకు ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాక గాంధీ వాద్రాతో పాటు అగ్ర నేతలు పాల్గొన్నారు. రెండోరోజు మహాసభల్లో సోనియాగాంధీ మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు, దేశానికి సవాలుతో కూడిన సమయం ఇదన్నారు. 
 
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మంచి ప్రభుత్వాన్ని ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ హయాంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలు ఆర్ఎస్ఎస్- బీజేపీ నియంత్రణలో వున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
దళితులు, మైనార్టీలు, మహిళలు చిత్రహింసలకు గురవుతున్నారని, కొందరు పారిశ్రామిక వేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సోనియా విమర్శించారు.
 
తన రాజకీయ ఇన్నింగ్స్‌కు ముగింపు పలకనున్నట్లు సోనియా చెప్పారు. తన రాజకీయ జీవితం భారత్ జోడో యాత్రతో ముగుస్తుండటం ఎంతో సంతోషంగా వుందని సోనియా వెల్లడించారు.