గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (15:48 IST)

మాజీ మంత్రి ఆళ్ల నానిపై చీటింగ్ కేసు.. కోర్టుకెక్కిన నాగమణి

alla nani
మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఏలూరు త్రీ-టౌన్ పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఇటీవలే పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో నాగమణి అనే ఓ మహిళా నాయకురాలు గాయపడింది. వైద్య ఖర్చులు భరిస్తామని అప్పుడు హామీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పట్టించుకోలేదని ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో నాని సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో గాయపడిన తనకు వైద్య ఖర్చుల భరిస్తానని ఆళ్ల నాని హామీ ఇచ్చారని, కానీ తర్వాత తమ గురించి పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీకి చెందిన నాగమణి అనే మహిళ ఆరోపించారు. 
 
బీమా వచ్చేలా చూస్తానని, తమ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఆళ్ల నాని, మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.