1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (08:55 IST)

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. 15మందికి తీవ్రగాయాలు

road accident
నెల్లూరు జిల్లా కావలిలో టోల్‌ప్లాజా వద్ద రెండు లారీలు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన బాధితులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇంకా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.